Select Location
All Locations
State
Region
City / District
13 78 శాతం పెరిగిన ఎగుమతులు...పది శాతం పెరిగిన దిగుమతులు

13 78 శాతం పెరిగిన ఎగుమతులు...పది శాతం పెరిగిన దిగుమతులు

న్యూఢిల్లీ: దేశీయ వస్తు ఎగుమతులు గత నెల 13.78 శాతం పెరిగి 43.56 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) కు చేరాయి. గత నాలుగేళ్లలో ఒక నెలలో ఇంత ఎక్కువ వృద్ధి కనిపించడం ఇదే మొదటిసారి. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు దూసుకెళ్లడం ఇందుకు కారణం. దిగుమతులు కూడా 10 శాతం పెరిగి ఆరు నెలల గరిష్టమైన 71.94 బిలియన్ డాలర్ల (రూ.6.89 లక్షల కోట్లు) కు చేరుకున్నాయి.

దీంతో వాణిజ్య లోటు మూడు నెలల గరిష్ట స్థాయి అయిన 28.38 బిలియన్ డాలర్ల (రూ.2.72 లక్షల కోట్లు)కు పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, మాంసం, పాల ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ రంగాలు ఎగుమతులకు ఊతమిచ్చాయి. ఎలక్ట్రానిక్ ఎగుమతులు రూ.49,560 కోట్లకు చేరగా, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా విలువ రూ.92,026 కోట్లు ఉంది. బంగారం దిగుమతులు 81.69 శాతం పెరిగి రూ.53,873 కోట్లకు చేరాయి.


V6 News 58 minutes ago
Home Flash News