Jihadi Drug: 182 కోట్ల ఖరీదైన జిహాదీ డ్రగ్ స్వాధీనం: కేంద్ర మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దేశంలో తొలిసారి జిహాదీ డ్రగ్(Jihadi Drug)ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ నార్కోటిక్స్ ట్రాఫిక్కింగ్ బృందంపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. కాప్టగాన్ అనే ఆ డ్రగ్ విలువ మార్కెట్లో సుమారు 182 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ పట్టివేతకు ఆపరేషన్ రేజ్‌పిల్ అనే కోడ్ నేమ్ పెట్టారు. డ్రగ్ ట్రాఫిక్కింగ్‌కు పాల్పడిన విదేశీ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ కన్‌సైన్మెంట్ ను పశ్చిమాసియా దేశాలకు తరలిస్తున్నారు. ఇండియాను ట్రాన్సిట్ మార్గంలో వాడేందుకు ప్రయత్నించారు.
అమిత్ షా తన ఎక్స్ అకౌంట్‌లో ఈ విషయాన్ని చెప్పారు. డ్రగ్ ఫ్రీ ఇండియా కావలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పనిచేస్తోందని, దానిలో భాగంగానే అరెస్టులు జరిగినట్లు వెల్లడించారు. ఆపరేషన్ రేజ్‌పిల్ ద్వారా జిహాదీ డ్రగ్‌ను పట్టుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఇండియాలోకి ఎంటరయ్యే ప్రతి గ్రాము డ్రగ్‌ను విడిచిపేట్టేది లేదన్నారు. క్యాప్టగాన్ అనేది అంఫిటమైన్ తరహా ఉత్ప్రేరకం. ఇది నిషేధిత డ్రగ్. పశ్చిమాసియాలోని మిలిటెంట్ గ్రూపులు, వ్యవస్థీకృత నేరగాళ్లు దీన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కన్‌సైన్మెంట్ వెనుక ఉన్న భారీ నెట్వర్క్‌ను చేధించనున్నట్లు చెప్పారు.అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపనున్నట్లు చెప్పారు.