35 నుంచి 40 శాతం మంది ఫేక్ అడ్వకేట్లే.. BCI చైర్పర్సన్ సంచలన వ్యాఖ్యలు
మన దేశంలో 35 నుంచి 40 శాతం మంది ఫేక్ అడ్వకేట్స్ అని బార్ కౌన్సి్ల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 35- నుంచి 40 శాతం మంది న్యాయవాదులు నకిలీ డిగ్రీలతో వృత్తిలో కొనసాగుతున్నారని.. ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లతో కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారని బార్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ విషయం తమకు తెలుసని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకునే పనిలోనే ఉన్నామని బీసీఐ ఛైర్‌పర్సన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. కోర్టు ప్రాంగణాల్లో నల్ల కోటు ధరించి కనిపించే వారిలో సుమారు 35 నుంచి 40 శాతం మంది నకిలీ అడ్వకేట్లనే సంగతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలుసని, వారి డిగ్రీలు పూర్తిగా నకిలీవని ఆయన ఆరోపించారు.