Select Location
All Locations
State
Region
City / District
బెంగాల్‌ రీపోలింగ్‌ సీటులో బీజేపీ గ్రాండ్‌ విక్టరీ.. లక్షకుపైగా మెజార్టీతో ఫాల్తా సెగ్మెంట్‌ కైవసం

బెంగాల్‌ రీపోలింగ్‌ సీటులో బీజేపీ గ్రాండ్‌ విక్టరీ.. లక్షకుపైగా మెజార్టీతో ఫాల్తా సెగ్మెంట్‌ కైవసం

కోల్‌కతా: బెంగాల్‌లోని ఫాల్తా అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన రీపోలింగ్‌లో బీజేపీ గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దివాన్షు పాండా లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఆయనకు మొత్తం 1.49 లక్షల ఓట్లు రాగా, సీపీఎం అభ్యర్థి 40 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో దివాన్షు పాండా 1,09,021 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచినట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది.

కాంగ్రెస్‌ అభ్యర్థికి 10 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఎంసీ అభ్యర్థి జహంగీర్‌‌ ఖాన్‌ నాలుగో ప్లేస్‌కు పరిమితమయ్యారు. ఆయనకు 7,783 ఓట్లు మాత్రమే లభించాయి. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతున్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఈ సారి బీజేపీ భారీ ఆధిక్యంతో కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 208కి చేరింది. రీపోలింగ్‌ ఫలితంపై బెంగాల్‌ సీఎం సువేందు అధికారి స్పందిస్తూ, “ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం దొరికితే వాస్తవ పరిస్థితి బయటపడుతుందని ఫాల్తా తీర్పు నిరూపించింది” అని అన్నారు. తాను లక్ష ఓట్ల మెజారిటీ కోరగా ప్రజలు నుంచి అంతకంటే ఎక్కువే మద్దతు లభించిందని కృతజ్ఞతలు తెలిపారు.


V6 News 46 minutes ago
Home Flash News