హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం
కరీంనగర్ కార్పొరేషన్, మే 26: “అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటి అమలులో పూర్తిగా విఫలమైంది. రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి రగులుతున్నది. బీఆర్‌ఎస్‌కు రోజురోజుకూ ప్రజా మద్దతు పెరుగుతున్న ది” అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ.. పార్టీ మీద ప్రేమ, పార్టీ కోసం పనిచేసే వారికే సభ్యత్వం ఇవ్వాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు చేయాలని మాట్లాడిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్‌ఎస్సే గెలుస్తుందని, మళ్లీ కేసీఆ ర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ బాస్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలుపాలని శ్రేణులకు సూచించారు. నాఫ్స్‌కాబ్ చైర్మన్, బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలతో అనుబంధం ఉన్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని తెలిపారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రైతుబంధు పేరుతో కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి సాయం అందిస్తే, రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ పది వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు.