Select Location
All Locations
State
Region
City / District
గుజరాత్ లో ఎబోలా అలర్ట్: వైరస్ సోకినట్లు అనుమానం..నలుగురిని క్వారంటైన్ కు తరలింపు

గుజరాత్ లో ఎబోలా అలర్ట్: వైరస్ సోకినట్లు అనుమానం..నలుగురిని క్వారంటైన్ కు తరలింపు

ఉగాండా ,కాంగో వంటి ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ ఎబోలా ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది.ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీ , ముంబై , గుజరాత్ ఎయిర్ పోర్టులలో హైఅలర్ట్ ప్రకటించారు. కాంగో, ఉగాండా వంటి దేశాలనుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఇటీవల ఆఫ్రికానుంచి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యాపారవేత్తతోపాటు నలుగురిని క్వారంటైన్ కు పంపించారు.

బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. అమోరి లోకోలాగా అనే 37 ఏళ్ల ఆఫ్రికన్ వ్యాపారవేత్త, కొద్ది రోజుల క్రితం ముంబైకి చేరుకుని అక్కడి నుంచి వడోదరకు వచ్చినట్లు గుర్తించారు. వడోదరలో ఆయనకు జ్వరం రావడంతో ముందుగా బ్యాంకర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు, అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వ్యాపారవేత్తతోపాటు ప్రయాణించిన పాట్రిక్ కాజా, వాలెంటిన్ జోడెల్ అనే మరో ఇద్దరిని, అలాగే వారితో సన్నిహితంగా ఉన్న డాక్టర్ సునీల్ ముసానాను కూడా అహ్మదాబాద్‌లోని ఎస్‌విపి ఆస్పత్రిలో వేర్వేరుగా క్వారంటైన్ చేశారు.


V6 News 1 hour ago
Home Flash News