Select Location
All Locations
State
Region
City / District
మామిడి పండ్ల ముచ్చట సరే.. పిల్లల గురించి మాట్లాడరా: ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్

మామిడి పండ్ల ముచ్చట సరే.. పిల్లల గురించి మాట్లాడరా: ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీకి మామిడి పండ్ల గురించే మాట్లాడే సమయం ఉంటది కానీ 18.5 లక్షల మంది సీబీఎస్‎ఈ పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడటానికి టైమ్ దొరకడం లేదని విమర్శించారు. సీబీఎస్ఈ12వ తరగతి ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) సిస్టమ్ కోసం బోర్డు టెండర్ ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.

విద్యార్థుల జవాబు పత్రాలను కోఎంప్ట్ సంస్థ వృత్తిపరమైన పరికరాలకు బదులుగా మొబైల్ ఫోన్లను ఉపయోగించి స్కాన్ చేశారని ఆరోపించారు. 2025, మే నెలలో కుదిరిన ఒప్పందం ప్రకారం సీబీఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాలను టెండర్ దక్కించుకున్న కంపెనీ కనీసం 300 డీపీఐ వద్ద ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో స్కాన్ చేయాలి. కానీ ఆగస్ట్‎లో జారీ చేసిన రీ టెండర్‎లో ఈ నిబంధనను తొలగించారు. పేపర్ స్కానర్ల రిజల్యూషన్ 200 డీపీఐకి పడిపోయింది.

కోంప్టు సంస్థకు అనుకూలంగా ఉండేలా టెండర్‌ను సవరించి నిబంధనలను సీబీఎస్ఈ నీరుగార్చిందని ఆరోపించారు. మన్ కీ బాత్‏లో మామిడి పండ్ల గురించి మాట్లాడే ప్రధాని మోడీకి సీబీఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాలను ఫోన్‎లో స్కాన్ చేసిన అంశంపై మాట్లాడే సమయం మాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ జవాబు పత్రాల మూల్యంకనంలో చోటు చేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు.


V6 News 1 hour ago
Home Flash News