Select Location
All Locations
State
Region
City / District
హైదరాబాద్ సిటీలో గ్యాస్ కష్టాలు..బుక్ చేస్తే రెండు వారాల వరకు వస్తలేదు .. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న డీలర్లు, బాయ్స్

హైదరాబాద్ సిటీలో గ్యాస్ కష్టాలు..బుక్ చేస్తే రెండు వారాల వరకు వస్తలేదు .. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న డీలర్లు, బాయ్స్

హైదరాబాద్​సిటీ, వెలుగు : జంటనగరాల్లో గ్యాస్​కష్టాలు తీరడం లేదు. గ్యాస్​సరఫరాలో కొరతతో కంపెనీలు కోరినంత ఇండెంట్​సరఫరా చేయడం లేదని డీలర్లు వాపోతున్నారు. దీంతో గ్యాస్​డెలివరీ ఆలస్యమవుతోందంటున్నారు. ఇంతేకాకుండా కమర్షియల్ సిలిండర్ల ధర పెంపు ప్రభావం డొమెస్టిక్​గ్యాస్​వినియోగదారులపై పడుతోంది.

సోమవారం కమర్షియల్​సిలిండర్ ధర రూ.66 వరకు పెరగ్గా, ప్రస్తుత​ధర రూ.3366 కు చేరింది. చాలా రోజుల నుంచే హోటళ్ల నిర్వాహకులు, టిఫిన్​సెంటర్లు, హాస్టల్స్​ఓనర్లు డొమెస్టిక్​ సిలిండర్లను బ్లాక్​లో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని క్యాష్​చేసుకునేందుకు కొందరు డీలర్లు నేరుగా సిలిండర్లను పక్కదారి పట్టిస్తుండగా, మరి కొందరు డెలివరీ బాయ్స్​ద్వారా దందా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్​సిలిండర్​ధర రూ.965 ఉండగా కొందరు రూ.2వేలకు అమ్ముకుంటున్నారు. రోజుకు బుకింగ్​లు లక్షన్నర గ్రేటర్​పరిధిలో 30 లక్షల గ్యాస్​కనెక్షన్లుండగా ఇంతకు ముందు రోజుకు 70 నుంచి 80 వేల బుకింగ్​లు జరిగేవి. కానీ, ప్రస్తుతం ఈ సంఖ్య లక్షన్నరకు చేరుకుంది. అయితే, డెలివరీ మాత్రం 70 నుంచి 80 వేలకు మించడం లేదు. 

పెరిగిన బుకింగ్​ తాకిడితో ఆయిల్​కంపెనీలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. సింగిల్​సిలిండర్​ఉన్న వారు ఇంతకు ముందు ఒక సిలిండర్​బుక్​ చేసుకున్న తర్వాత మరో సిలిండర్​బుక్​చేయడానికి 20 రోజులు ఆగాల్సి వచ్చేది. కానీ, తాజాగా దాన్ని 25 రోజులు చేశారు. అలాగే డబుల్​ సిలిండర్​ఉన్న వారికి ఇంతకుముందు 25 రోజులు ఉంటే ..ఇప్పుడు దాన్ని 30 రోజులు చేశారు. మరోవైపు సిలిండర్​బుక్​చేస్తే వారంలో డెలివరీ ఉంటుందని మెసేజ్​లు వస్తున్నాయి. కానీ, డెలివరీ అయ్యేసరికి రెండు వారాలు పడుతోంది. ఆలస్యమవుతోందని కొందరు వినియోగదారులు డీలర్లను సంప్రదిస్తే గ్యాస్​సరఫరా సరిగ్గా లేదని, వెయిట్​చేయక తప్పదని సమాధానం ఇస్తున్నారు.


V6 News 1 hour ago
Home Flash News