సౌరవ్ గంగూలీకి బిగ్ షాక్.. సెక్యూరిటీ తగ్గించిన బెంగాల్లోని బీజేపీ సర్కార్
Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ (BCCI) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సెక్యూరిటీ విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకుంది. గంగూలీకి ఇస్తున్న భారీ భద్రతను (Security Cover) తగ్గిస్తూ రాష్ట్ర సెక్యూరిటీ వింగ్ నిర్ణయం తీసుకుంది. 2023లో గంగూలీకి ఉన్న Y కేటగిరీ సెక్యూరిటీని Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, తాజా రివ్యూ తర్వాత దాన్ని మళ్లీ పాత కేటగిరీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ సెక్యూరిటీ కేటగిరీల డిఫరెన్స్?: Z కేటగిరీ: ఈ అరేంజ్‌మెంట్‌లో గంగూలీకి దాదాపు 8 నుంచి 10 మంది పోలీస్ సిబ్బంది సెక్యూరిటీగా ఉండేవారు. బెహలాలో ఉన్న అతని ఇంటి దగ్గర స్పెషల్ గార్డ్స్, అతను ఎక్కడికి ట్రావెల్ చేసినా వెంటే ఉండే ఆర్మ్‌డ్ ఎస్కార్ట్ ఉండేవాళ్లు.. ఇప్పుడు ఈ వీఐపీ ప్రొటెక్షన్‌ను రోల్‌బ్యాక్ చేసేశారు.