Select Location
All Locations
State
Region
City / District
LPG Price Hike | సామాన్యుడిపై మరో భారం.. రూ.29 పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధర!

LPG Price Hike | సామాన్యుడిపై మరో భారం.. రూ.29 పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధర!

Gas Cylinder Price | ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలపై, కేంద్ర ప్ర‌భుత్వం, చమురు కంపెనీలు మరో భారీ భారాన్ని మోపాయి. గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం ప్రతి సిలిండర్‌పై రూ.29 మేర ధరను పెంచారు.

ఈ ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటివరకు రూ.913 గా ఉన్న 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర, ఇప్పుడు ఏకంగా రూ.942 కి చేరుకుంది. పెరిగిన ఈ కొత్త ధరలు జూన్ 7వ తేదీ నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, రాష్ట్రాల్లోనూ ఈ ధరల పెరుగుదల స్థానిక పన్నులను బట్టి వర్తించనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, దిగుమతి వ్యయం పెరగడం వల్లే ఈ ధరలను సవరించాల్సి వచ్చిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇప్పటికే పెరిగిన కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి మరియు పేద కుటుంబాల బడ్జెట్‌పై ఈ హఠాత్తు నిర్ణయం మరింత అదనపు భారాన్ని వేయనుంది. ఒకేసారి దాదాపు ముప్పై రూపాయల వరకు గ్యాస్ ధర పెరగడంపై ప్ర‌జ‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Smacy News 1 hour ago
Home Flash News