Select Location
All Locations
State
Region
City / District
పేపర్ లీక్ లపై కాంగ్రెస్ దేశవ్యాప్త పోరు..! విద్యార్థి సదస్సులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగం

పేపర్ లీక్ లపై కాంగ్రెస్ దేశవ్యాప్త పోరు..! విద్యార్థి సదస్సులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగం

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీలు, అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో భాగంగా లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోని ప్రముఖ ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌లలో వరుసగా విద్యార్థి సదస్సులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 17న రాజస్తాన్‌‌‌‌లోని కోటా నుంచి ఈ సదస్సులు ప్రారంభం కానున్నాయి. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులందరినీ ఏకం చేయడం, పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన యువతకు ఒక వేదికను కల్పించి, ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ఈమేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘భారత యువత ఎదుర్కొంటున్న ఈ తీవ్ర సంక్షోభంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్ర చర్చకు పట్టుబడతాం. యువత ప్రయోజనాలు, హక్కులు, వారి భవిష్యత్తును రక్షించడానికి అవసరమైన చట్టపరమైన చర్యల కోసం ఒత్తిడి తెస్తాం’’ అని తెలిపారు.


V6 News 2 hours ago
Home Flash News