Select Location
All Locations
State
Region
City / District
 ‘మీ తండ్రి గౌరవం కోసమైనా పోలీసులను కక్ష సాధింపుకు వాడొద్దు’.. పవన్‌ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు

‘మీ తండ్రి గౌరవం కోసమైనా పోలీసులను కక్ష సాధింపుకు వాడొద్దు’.. పవన్‌ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు

Prakash Raj | నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన పోస్టులు రాజకీయంగా కూడా చర్చకు దారితీశాయి

Prakash Raj | నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన పోస్టులు రాజకీయంగా కూడా చర్చకు దారితీశాయి. తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన ప్రకాష్ రాజ్.. “పోలీస్ శాఖలో సేవ చేసిన మీ తండ్రిగారి పట్ల మీకున్న గౌరవం కోసమైనా, పదవి వచ్చిందనే కారణంతో వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించవద్దు” అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోయినా, పవన్ తండ్రి కొణిదెల వెంకట్రావు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించడం వల్ల ఈ వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై కూడా ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత మరో కేసులో మళ్లీ అదుపులోకి తీసుకోవడం వివాదానికి దారితీసింది. ఈ పరిణామాలపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపుకు వినియోగిస్తున్నారంటూ విమర్శించారు. మరో పోస్టులో ఆయన అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి ఎంతవరకు వెళ్తారు? రోజురోజుకూ మీ నిజస్వరూపం బయటపడుతోంది అంటూ విమర్శలు చేశారు

ప్రశ్న రావణ్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మరో కేసు నమోదు చేయడం వంటి పరిణామాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ చర్యలు అధికార దుర్వినియోగానికి ఉదాహరణగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.ప్రశ్న రావణ్‌ను పోలీసులు తరలిస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ప్రకాష్ రాజ్ షేర్ చేశారు. ఆ వీడియోకు స్పందిస్తూ.. మీ పార్టీ కార్యకర్తల ఈ ప్రవర్తన ఏమిటి? ప్రశ్నిస్తే చంపేస్తారా? ఈ ఘటనపై చర్యలు తీసుకుంటారా? అంటూ పవన్ కళ్యాణ్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.


Smacy News 1 hour ago
Home Flash News