Select Location
All Locations
State
Region
City / District
మేడిగడ్డకు 91 వేల క్యూసెకుల వరద

మేడిగడ్డకు 91 వేల క్యూసెకుల వరద

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం బరాజ్‌కు 90,580 క్యూసెకుల వరద రాగా, అధికారులు 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు.

ఎగువనుంచి భారీగా ఇన్‌ప్లో 85 గేట్ల ద్వారా నీరు కిందికి

మహదేవపూర్‌, జూలై 5 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం బరాజ్‌కు 90,580 క్యూసెకుల వరద రాగా, అధికారులు 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని, గోదావరి పరీవాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

అలాగే, కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 5.460 మీటర్ల ఎత్తుకు చేరినట్టు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు తెలిపారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించారు.


Smacy News 1 hour ago
Home Flash News