Select Location
All Locations
State
Region
City / District
జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం కల్పించాలి : టీడబ్ల్యూజేఎఫ్‌

జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం కల్పించాలి : టీడబ్ల్యూజేఎఫ్‌

జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని తెలంగాణ వరింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టీడబ్ల్యూజేఎఫ్‌ పిలుపు మేరకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలోని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వినతిపత్రాలను అందజేశారు

హైదరాబాద్‌, జూలై 10 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని తెలంగాణ వరింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టీడబ్ల్యూజేఎఫ్‌ పిలుపు మేరకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలోని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. హుస్నాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, హైదరాబాద్‌ సచివాలయం లో రవాణాశాఖ అదనపు కార్యదర్శి సునీతాదేవికి, బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి వినతిపత్రాలను అందజేశారు. అనంతరం సోమయ్య మాటాడారు. ప్రభుత్వం చాలా ఏండ్లుగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో 1/3 రాయితీపై ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ 50 శాతం మేరకు చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం, ఇతర రాష్ర్టాలకు 1/3 రాయితీ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు

సర్కార్‌ తీరును నిరసిస్తూ శిక్షణ కేంద్రం ఎదుట ఏఐవైఎఫ్‌ ధర్నా హైదరాబాద్‌, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ సూల్‌లో స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్స్‌(ఎస్‌ఆర్‌పీ) శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ప్రారంభమైన కార్యక్రమాలు శనివారం ముగియనున్నాయి. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ప్రైవేట్‌ పాఠశాలను ఎంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సర్కార్‌ టీచర్లకు కార్పొరేట్‌ విద్యాసంస్థలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఏఐవైఎఫ్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం శిక్షణ కార్యక్రమం కేంద్రం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.


Smacy News 1 hour ago
Home Flash News