కేంద్ర మంత్రులతో సీఎం భేటీ
ఢిల్లీ, జూలై 14(నమస్తే తెలంగాణ: అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడరీతో విడివిడిగా సమావేశమై ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాజెక్టుల మీద విజ్ఞప్తులు ఇచ్చారు. రామ్మోహన్ నాయుడితో జరిగిన భేటీలో వరంగల్(మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం కోరారు.Geographic Reference
వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్, విమాన శిక్షణ కేంద్రం(ఎఫ్‌టీవో) ఏర్పాటుచేయాలని, కాకతీయ సంసృతికి ప్రతిబింబంగా విమానాశ్రయ రూపకల్పన ఉండాలని సూచించారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి, 2028 జూన్ 2 నాటికి పనులు పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. హుస్సేన్‌సాగర్-ప్రకాశం బ్యారే జీ మధ్య సీ ప్లేన్ సేవలను పరిశీలించాలని కూడా ప్రతిపాదించారు. ఇక నితిన్ గడరీతో జరిగిన సమావేశంలో రీజినల్ రింగ్‌రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించాలని, దక్షిణ భాగానికీ అనుమతులు మంజూరు చేయాలని సీఎం కో రారు. ఫ్యూచర్‌సిటీ-అమరావతి-బందర్ పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-మంచిర్యాల మధ్య ప్రత్యామ్నాయ ఆరు వరుసల జాతీయ రహదారికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.