బిహార్ నుంచి పారిపోండి..లేదంటే జైలుకే..నేరస్తులకు సీఎం హెచ్చరిక
భగల్‌పూర్: రాష్ట్రంలో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి స్పష్టం చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా నేరస్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. నేరగాళ్లంతా రాష్ట్రం విడిచి పారిపోవాలి లేదా జైళ్లకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. బుధవారం బిహార్ వ్యాప్తంగా 211 కొత్త డిగ్రీ కాలేజీలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కామెంట్లను సామ్రాట్ ప్రస్తావించారు. నేరాలకు పాల్పడే ఎవరికైనా బిహార్‌లో చోటు లేదని స్పష్టం చేశారు.