Select Location
All Locations
State
Region
City / District
బుమ్రా ఫిట్నెస్పై సందిగ్ధత! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్కు డౌటేనా..

బుమ్రా ఫిట్నెస్పై సందిగ్ధత! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్కు డౌటేనా..

బెంగళూరు: శ్రీలంకతో రెండు టెస్ట్‌‌ మ్యాచ్‌‌ల సిరీస్‌‌ కోసం వచ్చే వారం టీమిండియాను ఎంపిక చేయనున్నారు. స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా ఫిట్‌‌నెస్‌‌ ఇంకా సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇంగ్లండ్‌‌తో లార్డ్స్‌‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఎడమ కాలికి గాయం కావడంతో బుమ్రా ఆటకు దూరమయ్యాడు.

ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్‌‌లో ఉన్నాడు. ఆగస్టు 15 నుంచి మొదలయ్యే లంక టూర్‌‌ వరకు బుమ్రా పూర్తి ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తాడని అంచనా వేస్తున్నారు. ఇతర పేసర్లుగా సిరాజ్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణను తీసుకోనున్నారు. ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రానున్నారు. కుల్దీప్‌‌ యాదవ్‌‌, మానవ్‌‌ సుతార్‌‌, వాషింగ్టన్‌‌ సుందర్‌‌ స్పిన్‌‌ బాధ్యతలను పంచుకోనున్నారు. బ్యాకప్‌‌ స్పిన్నర్‌‌గా హర్ష్‌‌ దూబేను కొనసాగించే చాన్సెస్‌‌ ఉన్నాయి.


V6 News 1 hour ago
Home Flash News