Select Location
All Locations
State
Region
City / District
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 230 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్‌‌కు‌‌ వైభవ్‌‌ సూర్యవంశీ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 230 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్‌‌కు‌‌ వైభవ్‌‌ సూర్యవంశీ

దుబాయ్: టీమిండియా వండర్‌‌‌‌ కిడ్‌‌ వైభవ్‌‌ సూర్యవంశీ.. ఐసీసీ టీ20 ర్యాంక్‌‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో వైభవ్‌‌ (536) ఏకంగా 230 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్‌‌కు చేరాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌లో రెండు హాఫ్‌‌ సెంచరీలతో కలిపి 151 రన్స్‌‌ చేయడం కలిసొచ్చింది. ఇషాన్‌‌ కిషన్‌‌ (910) టాప్‌‌లో కొనసాగుతుండగా, తిలక్‌‌ వర్మ (750) రెండు ప్లేస్‌‌లు ఎగబాకి ఆరో ర్యాంక్‌‌లో నిలిచాడు. కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (630) 24వ ర్యాంక్‌‌లో ఉన్నాడు. లెగ్‌‌ స్పిన్నర్‌‌ రవి బిష్ణోయ్‌‌ 31 స్థానాలు మెరుగుపడి 41వ ర్యాంక్‌‌ను సాధించాడు. గాయం కారణంగా జింబాబ్వే టూర్‌‌కు దూరమైన స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి టాప్–10లో ఉన్నాడు. వన్డేల్లో కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (801) మళ్లీ నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌ను సొంతం చేసుకున్నాడు. విరాట్‌‌ కోహ్లీ (767), రోహిత్‌‌ శర్మ (758) మూడు, నాలుగు ర్యాంక్‌‌ల్లో మార్పులేదు.


V6 News 1 hour ago
Home Flash News