Mohammed Shami | యువ పేసర్లపై సెలెక్టర్ల ఫోకస్..మహ్మద్ షమీ రీఎంట్రీపై సందిగ్ధం
Mohammed Shami | భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమేనా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారి కనిపించాడు. టెస్టు క్రికెట్‌కు వస్తే.. దాదాపు మూడేళ్లుగా అతను భారత జట్టు తరఫున ఆడలేదు.

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రాబోయే టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్, 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియాలో తరాల మార్పు వేగంగా జరుగుతోంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను యువ ప్రతిభ క్రమంగా భర్తీ చేస్తోంది. ఈ నిర్ణయంపై మాజీ భారత కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ బౌలర్లైన గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ వంటి ఆటగాళ్లు మంచి ప్రతిభ కలిగినవారేనని, భవిష్యత్తులో ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, షమీ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ను పూర్తిగా పక్కన పెట్టడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. షమీ ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నర్. అలాంటి బౌలర్‌ను ఒక్కసారిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయమా అనే సందేహం కలుగుతోంది. అనుభవం, నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను సరైన సమయంలో ఉపయోగించుకోవడం కూడా జట్టు ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది అని శ్రీకాంత్ పేర్కొన్నారు.