Select Location
All Locations
State
Region
City / District
త్రీ మెన్ కమిటీ మీటింగ్‌‌‌‌ మళ్లీ వాయిదా..అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

త్రీ మెన్ కమిటీ మీటింగ్‌‌‌‌ మళ్లీ వాయిదా..అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్ మళ్లీ వాయిదా పడింది. నీటి వినియోగానికి సంబంధించి సోమవారం నిర్వహించాల్సిన త్రీ మెన్‌‌‌‌ కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు రెండు రాష్ట్రాలకు బోర్డు తాజాగా సమాచారమిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో త్రీ మెన్ కమిటీ మీటింగ్‌‌‌‌కు రాలేమని, కాబట్టి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ బోర్డుకు ఏపీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. అయితే, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు త్రీ మెన్ కమిటీ మీటింగ్ జరిగే చాన్స్ కనిపించడం లేదు. 

వాస్తవంగా ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీనే తొలుత ప్రతిపాదించింది. దీంతో బోర్డు కూడా తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే13వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తొలుత ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతామని ఏపీ అధికారులు చెప్పడంతో మన అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ సమావేశాన్ని 17వ తేదీకి బోర్డు వాయిదా వేసింది.


V6 News 50 minutes ago
Home Flash News