Select Location
All Locations
State
Region
City / District
పంచాయతీ సెక్రటరీల సమస్యలు పరిష్కరించండి..స్పెషల్ సీఎస్‌‌ను కలిసిన పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ నేతలు

పంచాయతీ సెక్రటరీల సమస్యలు పరిష్కరించండి..స్పెషల్ సీఎస్‌‌ను కలిసిన పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ నేతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పంచా యతీ సెక్రటరీల దీర్ఘకాలిక సమస్యలను వెంట నే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ (టీపీఎస్‌‌ఎఫ్) నేతలు ప్రభు త్వాన్ని కోరారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం సెక్రటేరియెట్‌‌లో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్‌‌ను మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం సమర్పించింది. 

తమ సమస్యలను వివరించగా, దాన కిశోర్ సానుకూలంగా స్పందించారని.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌‌తో చర్చించి సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సంఘ ప్రతినిధులు తెలిపారు. ఈ భేటీలో టీపీఎస్‌‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


V6 News 1 hour ago
Home Flash News