టెన్త్, ఐటీఐ చేశారా ? CSIRలో ప్రభుత్వ ఉద్యోగాలు.. రూపాయి ఫీజు లేదు.. అప్లయ్ చేసుకోండి !
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ (సీఓపీఏ) 21, డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ (డీటీపీఓ) 07. కంప్యూటర్ హార్డ్ వేర్ & నెట్ వర్క్ మెయింటెనెన్స్ (సీహెచ్ & ఎన్ఎం) 05, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్ టీ) 02, డ్రాఫ్ట్స్ మన్ (ఆర్కిటెక్చర్) 02. ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 02, డ్రాఫ్ట్స్ మన్ (మెకానికల్) 01. డ్రాఫ్ట్స్ మన్ (సివిల్) 01, లాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్ (ఎల్ఎసీపీ) 01, ఇంటీరియర్ డిజైనర్ 01. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమాన కోర్సును సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా నేషనల్ / స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండడం తప్ప నిసరి.
పని అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 18. అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ బీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.500 చెల్లించాలి. లాస్ట్ డేట్: సెప్టెంబర్ 17. సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://rab.csir.res.in/ ను సందర్శించండి.