Select Location
All Locations
State
Region
City / District
సదరన్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన సీఎంలు చంద్రబాబు, విజయ్‌

సదరన్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన సీఎంలు చంద్రబాబు, విజయ్‌

చెన్నై: కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో దక్షిణ మండలి (సదరన్‌ కౌన్సిల్‌) సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌, కేరళ సీఎం సతీశన్‌, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మిగిలిన ముఖ్యమంత్రులు కలుసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను ఏపీ సీఎం కార్యాలయం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు, కేటాయింపులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానంగా నీట్‌ వివాదం, కావేరి జలాలు, నియోజకవర్గాల పునర్విభజనపై తమ అభ్యంతరాలను దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.


Eenadu Telugu 46 minutes ago
Home Flash News