South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పది నిమిషాల్లో 60 వేల టికెట్ల బుకింగ్‌

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పది నిమిషాల్లో 60 వేల టికెట్ల బుకింగ్‌

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేసింది. రోజుకు పదివేల చొప్పున మొత్తం 60 వేల టికెట్లు విడుదల చేయగా.. అవన్నీ కేవలం పది నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. తితిదే వెబ్‌సైట్, యాప్‌లో ఆర్కిటెక్చర్‌ ఛేంజ్, అప్లికేషన్‌ అప్డేట్ చేయడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. లక్షల మంది భక్తులు టికెట్ల కోసం యత్నించగా.. తితిదే ఐటీ విభాగం సమర్థంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా టికెట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 24 days ago

Related News

10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
⬅ Back
➕ Post Ad
To Ads ➡