South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

యునిసెఫ్‌ సెలబ్రిటీ సలహాదారుగా స్మృతి మంధాన!

యునిసెఫ్‌ సెలబ్రిటీ సలహాదారుగా స్మృతి మంధాన!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్మృతి మంధాన (Smriti Mandhana)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమె యునిసెఫ్‌ (UNICEF) ఇండియా సెలబ్రిటీ సలహాదారుగా నియమితులయ్యారు. బాలికలకు సమాన అవకాశాలు, వారి ఆరోగ్యం, సంక్షేమం, క్రీడల్లో అవకాశాలు వంటి విషయంలో యునిసెఫ్‌తో కలిసి స్మృతి పనిచేయనుంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం (International Day of the Girl) సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.

‘యూనిసెఫ్ ఇండియాలో సెలబ్రిటీ అడ్వకేట్‌గా చేరడం చాలా గర్వంగా ఉంది. క్రికెట్ ఆడుతూ పెరగడం వల్ల ప్రతి కల ఒక అవకాశంతోనే మొదలవుతుందని నేను నేర్చుకున్నాను. కఠోర శ్రమ, పట్టుదల, ప్రోత్సాహంతో, ఆ అవకాశం ఒక అసాధారణమైన విషయంగా మారగలదు. పెద్ద కలలు కనేందుకు, వారి పూర్తి సామర్థ్యాన్ని అందుకొనేలా ప్రతి ఒక్కరికి అవకాశం దక్కాలి’ అని స్మృతి మంధాన పేర్కొన్నారు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 20 days ago

Related News

10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
⬅ Back
➕ Post Ad
To Ads ➡