South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఏపీలో పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఎన్నికల సంఘం

ఏపీలో పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఎన్నికల సంఘం

అమరావతి: నవంబరు 1న జరిగే పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 100 పట్టణ స్థానిక సంస్థలకు గాను 8 పూర్తి స్థాయిలో ఏకగ్రీవం కావడంతో మిగిలిన 92 స్థానాల్లో పోలింగ్‌కు సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని మల్లికార్జున వెల్లడించారు. నవంబరు 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. తుపాను, వర్షాల ఇబ్బందుల దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చే నివేదికలను బట్టి, అవసరమైతే నవంబరు 2న పోలింగ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నవంబరు 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్నారు.

📍 Tirupathi
📰 Eenadu Telugu
🕒 1 day ago

Related News

10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
⬅ Back
➕ Post Ad
To Ads ➡