... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
T20 World Cup: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే ఏ జట్టు సెమీస్‎కు వెళ్తుందంటే..?

T20 World Cup: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే ఏ జట్టు సెమీస్‎కు వెళ్తుందంటే..?

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్ 8లో రెండు విజయాలతో గ్రూప్ 1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్తు కన్ఫామ్ చేసుకుంది. మిగిలిన స్థానం కోసం అతిథ్య ఇండియా, వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. 2026, మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు రన్ రేట్‎తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‎కు చేరుకుంటుంది.

మ్యాచ్ రద్దైతే ఇండియా ఇంటికే..!

ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం టీమిండియా ఇంటి దారి పడుతోంది. ఈ మ్యాచ్‎కు రిజర్వ్ డే లేదు. కాబట్టి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇండియా, వెస్టిండీస్‎కు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు వెస్టిండీస్, ఇండియాకు చెరో మాడు పాయింట్లు ఉంటాయి. కానీ మెరుగైన నెట్ రన్‎తో కరీబియన్లు సెమీస్‎కు వెళ్తారు. సూపర్ 8 రౌండ్‎లో ఇండియా కంటే వెస్టిండీస్ రన్ రేటే మెరుగ్గా ఉంది.

సూపర్ 8 పోరులో భాగంగా జింబాబ్వేపై వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ జట్టు రన్ రేట్ అమాంతం ప్లస్ 3కి చేరింది. ఇదే సమయంలో సౌతాఫ్రికా చేతిలో ఇండియా 76 రన్స్ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. ఈ పరాజయంతో ఇండియా నెట్ రన్ రేట్ మైనస్‎లోకి వెళ్లింది.

ఇదిలా ఉండగానే వెస్టిండీస్‎ను సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తు చేయగా.. జింబాబ్వేపై భారత్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కరేబియన్ జట్టు నెట్ రన్ రేట్1.791 ఉండగా.. ఇండియా నెట్ రన్-రేట్ -0.1 గా ఉంది. ఇండియా కంటే రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఆదివారం (మార్చి 1) జరిగే మ్యాచ్ ఒక వేళ వర్షం కారణంగా రద్దైతే మాత్రం వెస్టిండీస్ నేరుగా సెమీస్‎కు అర్హత సాధిస్తుంది. అతిథ్య ఇండియా టైటిల్ వేట ముగుస్తుంది.

Source : Smacy News

2 days ago

Home Flash News