... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
మార్చి 31లోపు దేశానికి మావోయిస్టుల హింస నుంచి విముక్తి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

మార్చి 31లోపు దేశానికి మావోయిస్టుల హింస నుంచి విముక్తి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

పూరి: మావోయిస్టుల హింస నుంచి దేశానికి ఈనెల 31 లోపు విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్​ను తుడిచివేస్తామన్నారు. ఒడిశాలోని మహానందిలో శుక్రవారం నిర్వహించిన ‘57వ రైజింగ్ డే’ వేడుకల్లో ఆయన పాల్గొని రూ.890 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.

పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మావోయిస్టుల హింస నుంచి దేశానికి విముక్తి కల్పించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో సీఐఎస్ఎఫ్​ బలగాల సాయంతో అనుకున్నది సాధించామని చెప్పారు. ‘‘సీఐఎస్ఎఫ్ సిబ్బంది మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు.

దేశంలోని కీలక పోర్టుల రక్షణ బాధ్యతను వారికి ఇవ్వాలని నిర్ణయించాం. కొన్నేళ్లలో సీఐఎస్ఎఫ్​ పోర్ట్ ఫోలియోకు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్, నవీ ముంబై ఎయిర్​పోర్ట్, ఎన్టీపీసీ స్థావరాలు వంటి వివిధ ఎస్టాబ్లిష్​మెంట్లను కూడా జతచేశాం” అని షా పేర్కొన్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News