గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
ఇంటర్నెట్ డెస్క్: 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను (Gaddar Awards 2025) శనివారం ప్రకటించారు. అగ్ర నటుడు చిరంజీవిని (Chiranjeevi) ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో (NTR National Award) సత్కరించనున్నారు. ఇక, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ను (Kamal Haasan) పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారె అవార్డు వరించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు, షార్ట్‌ఫిల్మ్‌లకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది.