... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
-విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

-విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

బాల్కొండ, వెలుగు: విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నిజామాబాద్​జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్ గల్స్ హాస్టల్, మోడల్ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ కేర్ టేకర్ ఎం.వీణ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తమతో అనుచితంగా ప్రవర్తిస్తోందని స్టూడెంట్స్ కలెక్టర్ ఎదుట కంటతడి పెట్టారు. పరుష పదజాలంతో దూషిస్తూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని స్టాఫ్ కన్నీటి పర్యంతమయ్యారు.

దీంతో కలెక్టర్​ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ మేరకు జీఈసీవో భాగ్య లక్ష్మి, ఇన్​చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విచారణ చేసి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా వీణను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతకుముందు కలెక్టర్ మైనారిటీ స్కూల్ సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్, తరగతి గదులు పరిశీలించారు. గణితంలో పలు ప్రశ్నలు వేసి స్టూడెంట్స్ నుంచి సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన వారికి చాక్లెట్ బాక్సులు అందజేశారు. టీచర్ గా మారి పాఠాలు బోధించారు.

Source : V6 News

1 hour ago

Home Flash News