... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఇందిరమ్మ ఇండ్లను వెంటనే పూర్తి చేసుకోవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ ఇండ్లను వెంటనే పూర్తి చేసుకోవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పెగడపల్లి,వెలుగు: ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గురువారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో సాయిల సూరమ్మ–-ముని దంపతుల ఇందిరమ్మ గృహ ప్రవేశం చేయగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నంచర్ల గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

Source : V6 News

1 hour ago

Home Flash News