జమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ
ఎర్రుపాలెం,వెలుగు: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిరలో ని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 19 నుంచి 22 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
కార్యక్రమంలో జగన్మోహన్రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయ దేవశర్మ, గ్రామ సర్పంచ్ తుళ్లూరు నిర్మల, వకులా మాత స్టేడియ నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు.