... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
‘టెన్త్’ సెంటర్లలో జీరో మొబైల్ జోన్.. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు

‘టెన్త్’ సెంటర్లలో జీరో మొబైల్ జోన్.. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో నిబంధనలను విద్యాశాఖ మరింత కఠినతరం చేసింది. ఎగ్జామ్​ సెంటర్లలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధిస్తూ జీరో మొబైల్ జోన్ విధానం తీసుకువచ్చింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ.శ్రీహరి డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు.

కేవలం విద్యార్థులకే కాకుండా, ఇన్విజిలేటర్లు, ఇతర టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఈ రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో పరీక్ష జరుగుతున్న సమయంలోనే క్వశ్చన్ పేపర్ ఫోన్ల ద్వారా బయటకు రావడాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఎగ్జామ్​సెంటర్లలో పనిచేసే సిబ్బంది ప్రతిరోజూ విధుల్లో చేరే ముందు తమ వద్ద ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు లేవని డిక్లరేషన్​ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన డే- వైజ్ డ్యూటీ రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు. సంతకం చేసినా సిబ్బంది వద్ద ఫోన్ ఉన్నట్లు తనిఖీ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తిస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని చెప్పారు.

నిబంధనలను అతిక్రమించి ఫోన్లు వినియోగిస్తే 1997 నాటి తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీటితోపాటు సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. సిబ్బంది పొరపాటు చేస్తే చీఫ్ సూపరింటెండెంట్లనే వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం ఎగ్జామినేషన్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Source : V6 News

1 hour ago

Home Flash News