Telangana: వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు!
తెలంగాణలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 2లక్షల చేయూత పెన్షన్లు ఇవ్వబోతున్న అంసెబ్లీ బడ్జెట్ సమావేవాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అర్హులైన వారికి ఈ ఏడాది కొత్తగా చేయూత పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఎంతో కాలంగా కొత్త పెన్ష కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా 2లక్షల పెన్షన్లు ఇవ్వు బోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 2026-27 బడ్జెట్‌లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తాజా ప్రభుత్వం నిర్ణయంతో ఎంతో కాలంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఈ కొత్త పెన్షన్‌లు అందనున్నాయి.
అయితే ఇప్పటికే పెన్షన్‌ల కోసం అప్లికేషన్ చేసుకన్న వారి దరఖాస్తులను పరీశీలించి అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను అందించనుంది. ఈ పెన్షన్‌ల కోసం ఈ బడ్జెట్‌లో ఇప్పటికే ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చేయూత పెన్షన్లు అందిస్తున్న సభా వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 2 లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.