... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Sakhi Niwas: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. నగరాల్లో అతి తక్కవ ధరకే హాస్టల్స్‌లో ఉండొచ్చు

Sakhi Niwas: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. నగరాల్లో అతి తక్కవ ధరకే హాస్టల్స్‌లో ఉండొచ్చు

రాష్ట్రంలోని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సొంతగ్రామాలను వదిలి ఉద్యోగాల కోసం నగరాలు, పట్టణాల్లో నివసించే మహిళలకు సురక్షితమైన వసతిని కల్పించేందుకు సఖి నివాస్ అనే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లను ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్రభుత్వం నిర్ణయం మహిళా ఉద్యోగులకు ఎంతగానో భరోసాను ఇవ్వనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు అండగా నిలిచేందుకు చంద్రబాబు సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లో ఉంటూ ఉద్యోగం చేసే మహిళలకు వసతి కల్పించేందుకు సఖీ నివాస్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక్కో హాస్టల్‌లో సుమారు 30 మంది మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం వసతి కల్పించనుంది.

అయితే ప్రతి సఖి నివా‌సకు ఓ మేనేజర్‌, వార్డెన్‌, ముగ్గురుర కేర్‌ టేకర్లు , సెక్యూరిటీ గార్డు, ముగ్గురు నైట్‌ గార్డులను కూడా నియమించనున్నారు. ఈ ఉద్యోగులందరికి నెలకు సుమారు రూ.84000 వేల జీతం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అంటే ఈ సకీ నివాస్ నిర్వాహణకు ఏడాదికి సుమారు రూ.10.8లక్షలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.ఈ సకీ నివాస్‌లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు కూడా తక్కువ ధరకే వసతి, భోజన అందించనున్నారు.

Source : TV9 Telugu

1 hour ago

Home Flash News