... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Kishan Reddy: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భీకర దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారత్‌లో గ్యాస్, చమురు కొరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై వదంతులు వస్తున్న వస్తుండటంతో బుధవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో మాట్లాడినట్లు చెప్పారు.

తెలంగాణతోపాటుగా దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వారు వివరించినట్లు పేర్కొన్నారు. సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని వారు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఈ విషయంపై ప్రచారం అవుతున్న వేళ వదంతులు, అసత్య వార్తలను చూసి ప్రజలు భయాందోళనలకు గురికావొద్దన్నారు. తెలంగాణ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. జంటనగరాలు సహా.. తెలంగాణ వ్యాప్తంగా అవసరాలకు సరిపడా సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు. పుకార్లను వ్యాప్తిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి కారణం లేకుండా పెట్రోల్ బంకులను మూసేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

న్యూఢిల్లీలోని ఖనిజ్ కక్ష్‌లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ 7వ సర్వసభ్య సమావేశానికి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

దేశం కీలక ఖనిజాల విలువ గొలుసును బలోపేతం చేయడం.. దేశవ్యాప్తంగా అన్వేషణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో NMET పోషించగల కీలక పాత్రపై సమావేశంలో చర్చించారు. ఖనిజాల ఆవిష్కరణను వేగవంతం చేయడం.. దేశం దీర్ఘకాలిక పారిశ్రామిక, ఇంధన పరివర్తన లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై చర్చించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.

Source : Prime9News

1 hour ago

Home Flash News