PM Modi: బిగ్ న్యూస్.. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది.. గల్ఫ్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.. దీంతో యుద్ధం ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది.. ముఖ్యంగా గ్యాస్, చమురు సరఫరా తగ్గడంతో పలు దేశాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.. ముఖ్యంగా భారత్ లో సైతం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది.. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించనున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది.. గల్ఫ్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.. దీంతో యుద్ధం ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది.. ముఖ్యంగా గ్యాస్, చమురు సరఫరా తగ్గడంతో పలు దేశాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.. ముఖ్యంగా భారత్ లో సైతం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది.. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మోదీ.. పశ్చిమాసియా పరిస్థితులతోపాటు.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై కూడా సీఎంలతో నేరుగా మాట్లాడనున్నారు.
కాగా.. పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో దేశంలో ఇంధన కొరత నెలకొందని.. అయితే.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు.