... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
"అతను నా కాళ్ల దగ్గరకు వస్తాడనుకోలేదు": సౌదీ యువరాజుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

"అతను నా కాళ్ల దగ్గరకు వస్తాడనుకోలేదు": సౌదీ యువరాజుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS)ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్' కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది.

సౌదీ యువరాజు ఇప్పుడు అమెరికాకు లొంగి ఉన్నారనే అర్థం వచ్చేలా ట్రంప్ కొంచెం ఘాటుగా మాట్లాడారు. ఆ వీడియోలో "అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు అతను నాతో మంచిగా ఉండక తప్పదు." అమెరికా ప్రభావం పెరిగిందని చెబుతూ.. "యువరాజు నాతో పద్ధతిగా ఉంటేనే ఆయనకు మంచిది" అని ట్రంప్ అన్నారు.

"అమెరికా బలహీనపడిపోతుందని, నేను కూడా ఓడిపోయిన అధ్యక్షుడిగా మిగిలిపోతానని అతను అనుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అతను నా దగ్గర మర్యాదగా ఉండాలని మీరు అతనికి చెప్పండి," అని ట్రంప్ ఎగతాళి చేస్తూ మాట్లాడారు.

విచిత్రం ఏంటంటే, కేవలం కొద్ది రోజుల క్రితమే ట్రంప్ సౌదీ యువరాజును ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా ఇరాన్‌తో గొడవలు జరుగుతున్న సమయంలో బిన్ సల్మాన్‌ ఒక 'యోధుడు' అని పొగిడారు. అమెరికా తరపున అతను పోరాడుతున్నాడని, మనకు అండగా ఉన్నాడని అప్పట్లో ప్రశంసించారు.

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనను తక్కువ చేస్తూ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News