... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
తొలి పంచ్‌ అదిరేట్టు.. సూపరో‘హిట్‌’

తొలి పంచ్‌ అదిరేట్టు.. సూపరో‘హిట్‌’

23 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఇదేదో యువ బ్యాటర్ కొట్టాడనుకుంటే పొరపాటే. టీ20ల నుంచి వీడ్కోలు తీసుకున్న పవర్ హిట్టర్ రోహిత్‌ బ్యాట్ నుంచి వచ్చిన సూపర్ ఇన్నింగ్స్‌. తొలిరోజు విరాట్ అదరగొట్టగా.. తానేం తక్కువ కాదంటూ అంతకుమించిన ఆటతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు హిట్‌మ్యాన్.

దాదాపు 14 ఏళ్ల తర్వాత ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఓవైపు 220+ లక్ష్యమైనా సరే.. ఏమాత్రం బెదరలేదు. దానికి కారణం రోహిత్ - రికెల్టన్ దూకుడు అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. క్రీజ్‌లో కుదురుకున్నాక విశ్వరూపమే చూపించాడు. కేవలం 38 బంతుల్లోనే 205+ స్ట్రైక్‌రేట్‌తో 78 పరుగులు రాబట్టాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ఇక తన మార్క్‌ హుక్‌ షాట్లు, ఫుల్‌ షాట్లతోనే కాకుండా.. మైదానం నలువైపులా బంతిని పంపించాడు. ఇక ఫిట్‌నెస్‌పరంగా చాలా మెరుగ్గా ఉన్న అతడు మైదానంలో చాలా జోష్‌గా కనిపించాడు. ప్రస్తుత తరం యువ క్రికెటర్లకు గట్టి పోటీనిచ్చాడనడంలో సందేహం లేదు.

సరిగ్గా రెండేళ్ల కిందట తనకు ఎక్కడైతే అవమానం ఎదురైందో.. అక్కడే తన సత్తా ఏంటో చూపించాడు. అప్పటివరకు ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన అతడిని కాదని మేనేజ్‌మెంట్‌ హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించింది. సరేలే.. ఈ నిర్ణయం సాఫీగా సాగిపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ, అతడికి చెప్పకుండానే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారనే వాదనా ఉంది. 2024, 2025 ఎడిషన్లలో రోహిత్ ఆటపై ఆ ప్రభావం ఉందనేది కాదనలేని వాస్తవం. కానీ, ఇప్పుడు వాటన్నింటినీ పక్కనపెట్టి.. తానెంత కీలక ప్లేయరో అని నిరూపించాడు రోహిత్. ఇక్కడ తన సత్తా ఏంటో ఎవరికోసమూ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేనప్పటికీ.. అవమానాలను గురి చేసిన దగ్గరే శభాష్‌ అనిపించుకున్నాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌తో 2015 ఫైనల్‌లో రోహిత్ శర్మ 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. ఆటకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపించాడు. ఇప్పుడు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన జాబితాలో నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. అతడికి 50వ ఫిఫ్టీ. ఇక ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. కేకేఆర్‌పై 1,161 పరుగులు చేసిన రోహిత్.. పంజాబ్‌ కింగ్స్‌పై 1,159 రన్స్‌తో ఉన్న కోహ్లీని అధిగమించాడు.

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News