ఎస్టీ హాస్టల్‌లో దారుణం.. మద్యం మత్తులో విద్యార్థులపై రెచ్చిపోయిన సిబ్బంది..
జగిత్యాల ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. హాస్టల్ సిబ్బంది కామాటి శ్రీనివాస్ ప్రతి రోజూ మద్యంమత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తాగిన మత్తులో బాలురను తిడుతూ ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు.
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. హాస్టల్ సిబ్బంది కామాటి శ్రీనివాస్ ప్రతి రోజూ మద్యంమత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తాగిన మత్తులో బాలురను తిడుతూ ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. చీపురు తీసుకుని మరీ విద్యార్థులపై దాడి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక వీడియో తీసిన చిన్నారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ సహకారంతో పేద విద్యార్థులు చదువుకుందామని హాస్టళ్లలో చేరుతుంటే.. ఇలా వేధింపులకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు ఘటనపై వెంటనే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, తాళ్ల ధర్మారం నుంచి జగిత్యాలకు డిప్యూటేషన్‌పై కామాటి శ్రీనివాస్ వచ్చారు.