ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు
అమరావతి: ఏపీ పంచాయతీరాజ్ శాఖను 5 జాతీయ అవార్డులు వరించాయి. రెండు విభాగాల్లో ప్రథమ, ఒక విభాగంలో ద్వితీయ, మరో రెండింట్లో తృతీయ పురస్కారాలు లభించాయి. రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది. వైకాపా హయాంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ.. నేడు దేశంలోనే తొలిస్థానానికి చేరింది.