... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
‘రాజీనామా చేయ్‌.. బీఆర్‌ నాయుడు’

‘రాజీనామా చేయ్‌.. బీఆర్‌ నాయుడు’

సాక్షి, తిరుపతి: టీటీడీ ఛైర్మన్‌ నుంచి బీఆర్‌ నాయుడిని తొలగించాలని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడిను తొలగించాలంటూ నిరసన చేపట్టారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంంలో కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్‌ నాయుడు వచ్చాక అనేక వివాదాలు, అపశ్రుతులు జరిగాయని.. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్‌ నాయుడు వ్యవహరించారన్న భూమన.. బీఆర్‌ నాయుడిని తొలగించకపోతే మరింత ఉధృతంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఆర్కే రోజా మాట్లాడుతూ.. 

బీఆర్‌ నాయుడిని టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగించడం చంద్రబాబు చేతగానితనం అంటూ మండిపడ్డారు. లడ్డూ గురించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. మహిళను 30 ఏళ్లుగా బీఆర్‌ నాయుడు చిత్రహింసలకు గురిచేశాడు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ వ్యక్తిగత విషయాలు బీఅర్ నాయుడు బయటపెడతారని భయపడుతున్నారా?.  ..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు. బీఅర్ నాయుడిపై ఎందుకు స్పందించలేదు. నెయ్యి విషయంలో ఏమి లేకపోయినా మెట్లు కడిగావ్. మరి ఇప్పుడు బీఅర్ నాయుడు విషయంలో ఎలాంటి ప్రోక్షణ చేస్తావ్‌. లడ్డూ గురించి సీఎం చంద్రబాబు పచ్చి అబద్దపు మాటలు చెప్పారు. చివరికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏంలేదని తేలింది. ఇప్పటికైన చంద్రబాబు అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు.

Source : Sakshi

2 hours ago

Home Flash News