రూ.1 ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ (BSNL Freedom Plan)ను మళ్లీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ.1కే 30 రోజుల అపరిమిత సేవలను పొందొచ్చు. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే! ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. సిమ్ కూడా ఫ్రీ. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) లేదా రిటైలర్‌ను సంప్రదించాలని బీఎస్‌ఎన్‌ఎల్ సూచించింది.