IPL 2026 | ఆరెంజ్ క్యాప్ రేసులో ఇంప్యాక్ట్ సబ్.. పర్పుల్ క్యాప్ పోటీలో దూసుకెళ్తున్న బిష్ణోయ్..!
IPL 2026 : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ భారీ స్కోర్లు, ఉత్కంఠ పోరాటాలతో అలరిస్తోంది. దుమ్మురేపుతున్న కొందరు ఆరెంజ్ క్యాప్(Orange Cap) కోసం పోటీపడుతున్నారు. ప్రతిసారి రేసులో ఉండే విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ వంటి స్టార్లు వెనకబడగా.. యువకెరటం సమీర్ రిజ్వీ (Sameer Rizvi) శరవేగంగా దూసుకెళ్తున్నాడు. హెన్రిచ్ క్లాసెన్(సన్‌రైజర్స్ హైదరాబాద్) రెండో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), దేవ్‌దత్ పడిక్కల్ (ఆర్సీబీ), కూపర్ కొన్నొల్లీ(పంజాబ్ కింగ్స్)లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు. పర్పుల్ క్యాప్ విషయానికొస్తే..
రవి బిష్ణోయ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ల్‌లో దంచికొట్టినొళ్లదే ఆరెంజ్ క్యాప్. అత్యధిక పరుగులతో ఈ క్యాప్‌ను దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో ఈసారి సమీర్ రిజ్వీ పేరు చేరేలా ఉంది. మీరుట్‌కు చెందిన ఈ కుర్రాడు పంతొమ్మిదో సీజన్‌లో ఇంప్యాక్ట్ సబ్‌గా చెలరేగిపోతున్నాడు. నిరుడు చెన్నై సూపర్ కింగ్స్(CSK) తరఫున పెద్దగా రాణించిన ఈ చిచ్చరపిడుగు.. ఈ దఫా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ట్రంప్ కార్డ్‌గా అవతరించాడు. తొలి పోరులో అర్ధ శతకం.. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 97 రన్స్ కొట్టి ఢిల్లీని గెలిపించిన సమీర్ 160 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.