... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఎన్నికల్లో ఫింగర్ ప్రింట్ అమలుపై కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికల్లో ఫింగర్ ప్రింట్ అమలుపై కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (ఏప్రిల్ 13) ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ను మొదట ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించమని ధర్మాసనం సూచించింది. అయితే, ప్రస్తుతం జరుగుతోన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయాలని తాము కోరడం లేదని.. భవిష్యత్‎లో జరగబోయే ఎన్నికల్లో ఈ విధానం ఇంప్లిమెంట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఈ పిటిషన్‎ను విచారించేందుకు అంగీకరించింది. 

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థ అమలుపై అభిప్రాయం తెలియజేయాలని ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతోన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే పార్లమెంటరీ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని అనుసరించవచ్చో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరిన్ని వార్తలు

Source : V6 News

1 hour ago

Home Flash News