... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
విజయ్‌పైకి 'పూల బాంబ్' విసిరిన అభిమాని..

విజయ్‌పైకి 'పూల బాంబ్' విసిరిన అభిమాని.. సైకిల్ దిగి పరుగులు తీసిన దళపతి.. పోలీసు అధికారికి గాయాలు!

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయం మరింత వేడెక్కింది. అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకెళ్తున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్, 'తమిళగ వెట్రి కజగం' (TVK) అధినేత దళపతి విజయ్ తన ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. అయితే లేటెస్ట్ గా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఒక ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం చోటుచేసుకుంది. కన్యాకుమారిలో విజయ్ చేపట్టిన సైకిల్ ర్యాలీ సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఏప్రిల్ 12న కన్యాకుమారి వీధుల్లో వేలాది మంది అభిమానుల మధ్య విజయ్ సైకిల్‌పై వెళ్తుండగా ఒక ఊహించని సంఘటన జరిగింది. జనసమూహం నుంచి ఒక అభిమాని విజయ్ వైపు ఒక వస్తువును విసిరాడు. అది చూసిన వెంటనే విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, సైకిల్ దిగి భద్రతా సిబ్బంది వైపు పరిగెత్తారు. సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా అప్రమత్తమై ఆయన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. వెంటనే వ్యాన్ లో ఎక్కించారు. నిజానికి ఆ వస్తువు పేలుడు పదార్థం కాదు, అది పూలతో నిండిన ఒక చిన్న బంతి. 

అది కింద పడగానే పగిలి పూలు వెదజల్లింది. అయితే, ఆ సమయంలో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా విజయ్ అది 'బాంబు' ఏమోనని భావించి భయపడ్డారని నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ బాంబు అనుకుని పరుగులు తీశారు అంటూ వీడియోలు వైరల్ అవుతుండగా, అభిమానులు మాత్రం అది కేవలం ప్రాథమిక భద్రతా చర్య అని కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక పోలీసు అధికారి తొక్కిసలాటలో కింద పడటం కూడా కెమెరాకు చిక్కింది.

Source : V6 News

1 hour ago

Home Flash News