చరిత్ర సృష్టిస్తున్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లు 21వ శతాబ్దాంలోనే గొప్ప నిర్ణయం:ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత పార్లమెంటు త్వరలో ఒక నవ చరిత్రను సృష్టించబోతున్నదని, మహిళల దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల గురించి ప్రధాని ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖలు రాశారు.