Select Location
All Locations
State
Region
City / District
ఆప్తమిత్రుడు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు: మోదీ

ఆప్తమిత్రుడు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు: మోదీ

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కష్టపడి పనిచేసే ఏపీ సీఎం, ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. సీఎం చంద్రబాబుకు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యత తీసుకున్నారు. 

రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. పెట్టుబడులకు చిరునామాతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నారు. ఏపీ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్‌ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం జగన్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్ఫూర్తిదాయక నాయకులైన మిమ్మల్ని ‘నాన్న’గా పిలిచే అదృష్టం నాకు దక్కింది. ఏళ్లు గడిచే కొద్దీ ప్రజాసేవపై మీ తపన మరింత బలపడుతోంది. అనుభవం, దూరదృష్టితో రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్న తీరు ఆదర్శప్రాయం. కష్టసమయంలో పట్టుదల, ప్రజల పట్ల మీ అంకితభావం మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ -మంత్రి నారా లోకేశ్‌‌ ‘‘మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’’ - సినీ నటుడు చిరంజీవి ‘‘చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దూరదృష్టి, అభివృద్ధి పట్ల అంకితభావం.. ఇవే మీ నాయకత్వానికి ప్రతీక. రాష్ట్రాభివృద్ధికి మీ నిరంతర కృషి.. ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోంది. ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మీ విజన్‌ దేశానికే ఆదర్శం. మీ నాయకత్వంలో ఏపీ.. మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నా’’ -నందమూరి బాలకృష్ణ


Eenadu Telugu 1 hour ago
Home Flash News