Select Location
All Locations
State
Region
City / District
అరకోటి భూమి కొట్టేసేందుకు జనసేన నేత స్కెచ్‌

అరకోటి భూమి కొట్టేసేందుకు జనసేన నేత స్కెచ్‌

సాక్షి, కాకినాడ సిటీ: వరుసకు సోదరి అయిన మహిళ భూమి కొట్టేసేందుకు డీసీసీబీ చైర్మన్, కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు స్కెచ్‌ వేశారు. కాకినాడ జిల్లా యర్రవరంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 94 సెంట్ల భూమిని తన ఆధీనంలో పెట్టుకుని వరుసకు సోదరి అయిన అమలకంటి తులసీ కిరణ్మయిని తుమ్మల బాబు వేధిస్తున్నారు. కిరణ్మయి భర్త కిడ్నీ పేషెంట్‌ కావడంతో ఆ భూమి వ్యవహారం తాను చూసుకుంటానని నమ్మించి.. ఆ భూమికి సంబంధించిన పాస్‌ పుస్తకాలు ఆమె పేరిట ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.

అధికార పార్టీ నేత కాదనడంతో స్థానిక తహసీల్దార్‌ ఆమెకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తనకు పాస్‌బుక్‌ ఇవ్వకపోవడంతో బాధితురాలు తల్లితో కలసి సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీ­ఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. తుమ్మల బాబు తన పెదనాన్న కొడుకు అని, తన భూమి తనకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యా­దు­లో పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు తనకు పసుపు కుంకుమ మాన్యం కింద ఇచ్చిన ఈ భూమిని కొన్నేళ్లుగా తు­మ్మల బాబు ఆధీనంలో ఉంచుకొని తనను మానసిక క్షోభ­కు గురిచేస్తున్నారని తెలిపింది. తన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. 

తుమ్మల బాబు అధికారం బలంతో ఆ భూమికి పట్టాదార్‌ పాస్‌బుక్‌ కూడా సంపాదించినట్టు తెలిసిందన్నారు. ఆ భూ­మికి సంబంధించి పంట డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు ఆమె తెలిపింది. భూమి గొడ­వల నేపథ్యంలో తన భర్త గత ఏడాది సెప్టెంబర్‌లో ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు. పెద్దాపు­రం మండలం పులిమే­రు గ్రామంలో తన తండ్రికి చెందిన 5 సెంట్ల స్థలం కూడా కాజేసేందుకు తుమ్మల బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ విషయం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోయారు.


Sakshi 1 hour ago
Home Flash News