Select Location
All Locations
State
Region
City / District
కౌంటింగ్‌ వరకు.. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరవొద్దు: ఈసీ

కౌంటింగ్‌ వరకు.. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరవొద్దు: ఈసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కేరళ (Kerala)లోని జిల్లా ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందువరకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరవకూడదని ఆదేశాలు జారీచేసింది. కొయ్‌కోడ్‌ జిల్లాలోని పెరంబ్ర నియోజకవర్గంలోని ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచినట్లు ప్రచారం జరిగింది. దీంతోపాటు పాలక్కాడ్‌లోని నెన్నర నియోజకవర్గంలోని మరో స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచేందుకు యత్నించారన్న కథనాలు వెలువడ్డాయి. ఇదికాస్తా రాజకీయ దుమారం రేపింది. 

ఈ క్రమంలోనే కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్‌ యు కెల్కర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్ట్రాంగ్‌ రూమ్‌లను, సీల్‌ వేయని గదులను తెరవడం లాంటివి చేయొద్దని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, భద్రతను కాపాడేందుకు అధికారులంతా ఈ సూచనలు కచ్చితంగా పాటించాలని కోరారు. కాగా.. కేరళలోని 140 నియోజకవర్గాలకు ఈనెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.


Eenadu Telugu 2 hours ago
Home Flash News